నాకు కాబోయే భర్త ఇలా ఉండాలి: హీరోయిన్ రకుల్

Rakul Preet Singh about
  • నాకు ప్రేమ, పెళ్లిపై  నమ్మకం ఉంది
  • కాబోయే భర్తకు ఈ జీవితం పట్ల కచ్చితమైన స్పష్టత ఉండాలి
  • నేను సంప్రదాయాలకు విలువనిచ్చే కుటుంబం నుంచి వచ్చా
  • కాబోయే భర్త ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి
తనకు కాబోయే భర్త ఎలా ఉండాలనే విషయంపై హీరోయిన్ రకుల్ ‌ప్రీత్‌ సింగ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. తనకు ప్రేమ, పెళ్లిపై  నమ్మకం ఉందని, తనకు కాబోయే భర్తకు ఈ జీవితం పట్ల కచ్చితమైన స్పష్టత, అభిరుచి ఉండాలని చెప్పింది. తాను సంప్రదాయాలకు విలువనిచ్చే కుటుంబం నుంచి వచ్చానని తెలిపింది.

తన తండ్రి ఆర్మీలో ఉద్యోగం చేసిన కారణంతో తాను అందుకు సంబంధించిన వాతావరణంలోనే  పెరిగానని తెలిపింది. తనకు కాబోయే భర్త ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తే సంతోషిస్తానని తెలిపింది. తన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే తన పెళ్లి జరగాలని ఆశిస్తున్నానని చెప్పింది. తాను బీచ్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది.

కాగా, ప్రస్తుతం తను క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోంది. ఇందులో వైష్ణవ్‌ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. బాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాల్లో నటిస్తోంది.
Go Back to Shorts
Rakul Preet Singh
Tollywood
Bollywood
marriage

More Telugu News