Andhra Pradesh: ఏపీ కరోనా అప్ డేట్: కరోనాతో ఇద్దరి మృతి

ఏపీలో కరోనా మరణాల సంఖ్య బాగా తగ్గిపోయింది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారు. గుంటూరు జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు కరోనా ప్రభావంతో కన్నుమూశారు. అదే సమయంలో 64,354 కరోనా పరీక్షలు నిర్వహించగా 538 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 95, కృష్ణా జిల్లాలో 86, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 72 చొప్పున కొత్త కేసులు వచ్చాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 7 పాజిటివ్ కేసులు వచ్చాయి. కడప జిల్లాలో 13, అనంతపురం జిల్లాలో 14, కర్నూలు జిల్లాలో 18 కేసులు గుర్తించారు.

గత 24 గంటల్లో 558 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,73,995 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,61,711 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 5,237కి తగ్గగా, మరణాల సంఖ్య 7,047కి చేరింది.
Andhra Pradesh
Corona Virus
Update
Positive Cases
Deaths
Active Cases
COVID19

More Telugu News