Somu Veerraju: ప్రాజెక్టులకు అన్ని వేల కోట్ల అవసరం ఎందుకు?: జగన్ కు సోము వీర్రాజు ప్రశ్న

Somu Veerrau asks why Jagan needs thousands of crores rupees for projects
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబులపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రూ. 40 వేల కోట్లతో ప్రాజెక్టులను నిర్మిస్తామని జగన్ చెపుతున్నారని... ప్రాజెక్టుల నిర్మాణానికి అన్ని వేల కోట్ల అవసరం ఏముందని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం అమరావతిలో రూ. 1,800 కోట్లతో ఎయిమ్స్ ను నిర్మించిందని... రూ. 7,200 కోట్లతో చంద్రబాబు అమరావతిని ఎందుకు నిర్మించలేకపోయారని నిలదీశారు. 2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని చెప్పారు. కడపలో ఈరోజు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో సోము వీర్రాజు విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Somu Veerraju
BJP
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News