ఉదయ్ పూర్ లో అన్నయ్య నాగబాబుతో పవన్ ఇలా..!
- రేపు నిహారిక పెళ్లి
- రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వివాహ మహోత్సవం
- ఇప్పటికే ఉదయ్ పూర్ లో సందడి చేస్తున్న మెగా కుటుంబాలు
- కొద్దిసేపటి కిందట ఉదయ్ పూర్ చేరుకున్న పవన్ కల్యాణ్
- పవన్ రాకతో ప్యాలెస్ లో ఉత్సాహభరిత వాతావరణం
ఈ పెళ్లికి వస్తాడా, రాడా? అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం ఉదయ్ పూర్ లో ల్యాండయ్యారు. ఓ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన ఉదయ్ పూర్ చేరుకున్నారు. పవన్ రాకతో ఉదయ్ పూర్ ప్యాలెస్ లో మరింత ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. నాగబాబు తన సోదరుడు పవన్ ను వెంటబెట్టుకుని ప్యాలెస్ పరిసరాలను చూపించారు. కాగా, ఈ పెళ్లికి పవన్ కుమారుడు అకీరా, కుమార్తె ఆద్య కూడా విచ్చేసినట్టు తెలుస్తోంది.