Somu Veerraju: రానున్న రోజుల్లో టీడీపీ, కాంగ్రెస్ కనుమరుగవుతాయి: సోము వీర్రాజు

TDP and Congress will be no more in AP says Somu Veerraju
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పని అయిపోయిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాాజు అన్నారు. రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీలు కనుమరుగవుతాయని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ-జనసేన కూటమికి, వైసీపీకి మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో కోట్లాది రూపాయల కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. రాజధాని కోసం రూ. 7,200 కోట్లు తీసుకున్న చంద్రబాబు... కేవలం నాలుగు తాత్కాలిక బిల్డింగులను మాత్రమే కట్టారని చెప్పారు.

దేశంలో బీజేపీ మినహా ప్రతి పార్టీలో కుటుంబ పాలన ఉందని అన్నారు. పేదల కోసం బీజేపీ ఎంతో చేస్తోందని చెప్పారు. మోదీ ప్రధాని అయిన తర్వాత అగ్రవర్ణ పేదల కోసం 10 శాతం రిజర్వేషన్లను ఇచ్చారని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Somu Veerraju
BJP
Telugudesam
Chandrababu
Jana Reddy
YSRCP

More Telugu News