సముద్రంలో రకుల్ ప్రీత్ ప్లై బోర్డ్... ఏడు సార్లు నీళ్లల్లో పడ్డా, పట్టువదలక విజయం!

Rakul Tried Fly Board in Maldives
  • ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న రకుల్
  • వినోదయాత్రలో సాహసయాత్ర
  • రకుల్ ధైర్యవంతురాలంటున్న నెటిజన్లు
దక్షిణాది అందాల నటి రకుల్ ప్రీత్ సింగ్, ప్రస్తుతం మాల్దీవుల్లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు నిలిచిపోగా, దాదాపు ఎనిమిది నెలల పాటు ఇంటికే పరిమితమైన రకుల్, ఆపై కొంతకాలం ఎంజాయ్ చేయాలని భావించి, స్నేహితులతో కలిసి మాలేకు చెక్కేసింది.

ఇక అక్కడ వినోదయాత్రలో సాహసయాత్రను భాగం చేస్తూ, సముద్రంలో ప్లైబోర్డ్ చేసింది. నీటి ఒత్తిడి ఆధారంగా ఎగిరే మిషన్ పై నిలబడాలని పదేపదే ప్రయత్నించి విఫలం అయ్యానని, ఏడుసార్లు కిందపడిన తరువాత, ఎనిమిదోసారి నిలబడగలిగానని చెబుతూ, తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక దీన్ని చూసిన వారంతా రకుల్ ఎంతైనా ధైర్యవంతురాలేనని కితాబునిస్తున్నారు.
Go Back to Shorts
Rakul Preet Singh
Maldeeves
Fly Board

More Telugu News