ఇతనే పోలీసు 'సింగం'... వీడియో షేర్ చేసిన చెన్నై పోలీసు కమిషనర్!
ఇతను ఓ సూపర్ పోలీస్ అంటూ... గ్రేటర్ చెన్నై అదనపు పోలీసు కమిషనర్ మహేశ్ అగర్వాల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. మొబైల్స్ ను దొంగిలించి, బండిపై వెళుతున్న ఇద్దరిని వెంటాడిన రమేశ్ అనే ఓ ఎస్ఐ, ఒంటిచేత్తో వారిని అడ్డుకుని పట్టుకున్నారు.
ఇందుకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ ని మహేశ్ అగర్వాల్ షేర్ చేశారు. ఓ స్నాచర్ పట్టుబడిన తరువాత, మరో ముగ్గురిని అరెస్ట్ చేశామని, దొంగిలించబడిన 11 సెల్ ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు. ఈ వీడియో చూసిన వారంతా రమేశ్ పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.