14 రోజుల పాటు క్వారంటైన్‌లోకి హీరో సల్మాన్ ఖాన్!
- సల్మాన్ ఖాన్ డ్రైవరుకు కరోనా
- మరో ఇద్దరు ఉద్యోగులకు కూడా పాజిటివ్ నిర్ధారణ
- కుటుంబ సభ్యుల నుంచి దూరంగా సల్మాన్
కరోనా నిర్ధారణ అయిన తన సిబ్బందిని సల్మాన్ ఖాన్ ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందేలా చేస్తున్నారు. కాగా, దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల కొన్ని నెలలుగా సల్మాన్ ఖాన్ తన కుటుంబంతో కలిసి పన్వెల్ లోని ఫాంహౌస్ లోనే ఉన్నారు. అక్కడే వ్యవసాయ పనుల్లో పాల్గొంటూ వీడియోలు తీసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.