విలియమ్సన్ ను తీసేస్తారంటూ ప్రచారం... సన్ రైజర్స్ తోనే ఉంటాడన్న వార్నర్
- హైదరాబాదు జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న కేన్ విలియమ్సన్
- విలియమ్సన్ ను జట్టులోనే ఉంచాలన్న అభిమానులు
- తాను కూడా అదే కోరుకుంటానని వార్నర్ వెల్లడి
అయితే, వచ్చే సీజన్ కు విలియమ్సన్ ను సన్ రైజర్స్ జట్టు నుంచి తీసేస్తున్నారని, ఈ కివీస్ ఆటగాడు మరో జట్టుకు ఆడతాడని ప్రచారం జరుగుతోంది. దాంతో సన్ రైజర్స్ అభిమానులు ఈ విషయాన్ని కెప్టెన్ డేవిడ్ వార్నర్ దృష్టికి తీసుకెళ్లారు. మీ తర్వాత అందరి ఆశలు విలియమ్సన్ పైనే ఉన్నాయి, అతడిని హైదరాబాద్ జట్టులోనే ఉంచాలని సూచించారు.
దీనిపై వెంటనే స్పందించిన వార్నర్... విలియమ్సన్ ఎక్కడికీ వెళ్లడంలేదని, వచ్చే సీజన్ లోనూ సన్ రైజర్స్ కే ఆడతాడని స్పష్టం చేశాడు. విలియమ్సన్ ఎస్ఆర్ హెచ్ జట్టులో ఉండాలని తాను కూడా కోరుకుంటానని, అతడిని వదులుకునే ప్రసక్తేలేదని వెల్లడించాడు.