కె.విశ్వనాథ్ దంపతులతో గడిపిన సమయం సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది: చిరంజీవి
- కె.విశ్వనాథ్ నివాసానికి వెళ్లిన చిరంజీవి
- కళాతపస్వి దంపతులకు నూతన వస్త్రాల బహూకరణ
- పండుగ రోజున ఆత్మీయుడ్ని కలిశానని చిరంజీవి ట్వీట్
తమ సినిమా కుటుంబంలోని పెద్దాయన, తనకు గురువు, మార్గదర్శి, ఆత్మబంధువు అయిన కె.విశ్వనాథ్ గారి నివాసానికి వెళ్లి ఆ దంపతులను సత్కరించుకున్నానని చిరంజీవి వివరించారు. కె.విశ్వనాథ్ దంపతులతో గడిపిన సమయం సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు.