భార్య సురేఖతో కలిసి కె.విశ్వనాథ్ నివాసానికి వెళ్లిన చిరంజీవి... ఫొటోలు ఇవిగో!
- కె.విశ్వనాథ్ తో చిరు ఆత్మీయ సమావేశం
- కళాతపస్వి దంపతులకు నూతన వస్త్రాలు సమర్పించిన చిరు, సురేఖ
- చిరును హత్తుకుని మురిసిపోయిన కె.విశ్వనాథ్
ఈ సందర్భంగా తనకు పాదాభివందనం చేసిన చిరంజీవిని కె.విశ్వనాథ్ ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని వాత్సల్యం ప్రదర్శించారు. ఇరువురు అనేక విషయాలు ముచ్చటించారు. విశ్వనాథ్ దంపతుల యోగక్షేమాలను చిరు అడిగి తెలుసుకున్నారు. కాగా, చిరంజీవి దంపతులు పండుగ నాడు తమ నివాసానికి రావడం పట్ల కె.విశ్వనాథ్ హర్షం వ్యక్తం చేశారు.