Suma: బిగ్‌బాస్‌లోకి వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన యాంకర్ సుమ.. ఆమెను తన చిన్నప్పటి నుంచి చూస్తున్నానన్న నాగార్జున.. వీడియో ఇదిగో

  • తెలుగు బిగ్‌బాస్‌ ప్రేక్షకులకు మరింత కిక్ 
  • అందరినీ ఆశ్చర్యపర్చుతూ యాంకర్ సుమ హౌస్‌లోకి ఎంట్రీ
  • పంచుల మీద పంచులు
suma enters in bigboss

తెలుగు బిగ్‌బాస్‌ ప్రేక్షకులకు మరింత కిక్ అందించనుంది. అందరినీ ఆశ్చర్యపర్చుతూ యాంకర్ సుమ హౌస్‌లోకి ప్రవేశించింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా సుమ కనకాల వచ్చిందని స్టార్ మా తెలిపింది. ఫన్ ఇప్పుడు డబుల్ అవుతుంని పేర్కొంటూ ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. సుమ రావడంతోనే హౌస్‌లో పంచులు పేలాయి.

సుమను తాను చిన్నప్పటి నుంచీ చూస్తున్నానని అవినాశ్ అన్నాడు. దీంతో నాగార్జున స్పందిస్తూ... ‘ఏ ఊరుకో.. నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా’ అని పంచ్ వేశారు. తన తండ్రితో సుమ ప్రోగ్రాములు చేసే కాలం నుంచి ఇప్పటి వరకు అలాగే ఉందని నాగ్ చివర్లోనూ మరో పంచ్ వేశారు. అనంతరం బిగ్‌బాస్‌ మొత్తం సుమ వేస్తోన్న పంచ్‌లతో నవ్వులతో నిండిపోయింది. సుమ నిజంగానే బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉంటారా? అని హౌస్ మేట్స్ ప్రశ్నించారు.

More Telugu News