తన భారీ కటౌట్ చూసి సమంత ఆశ్చర్యం!

samanta BIGGEST poster goes viral
  • 'ఆహా' ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం వ్యాఖ్యాతగా మారిన సమంత 
  • ‘సామ్ జామ్’కు సంబంధించిన భారీ కటౌట్‌
  • ఆహా కార్యాలయంపై కటౌట్
తనకు సంబంధించిన ఓ భారీ కటౌట్‌ను చూసి హీరోయిన్ సమంత సంభ్రమాశ్చర్యాలకు గురైంది. 'ఆహా' ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం సమంత హోస్ట్ గా మారుతోన్న విషయం తెలిసిందే.  'ఆహా' పలు ఎంటర్‌టైన్ మెంట్ కార్యక్రమాలను రూపొందిస్తుండగా  ఇందులో భాగంగా సమంత హోస్టుగా 'సామ్ జామ్' అనే షోను రూపుదిద్దుకుంటోంది.  

ఈ షోకు సంబంధించిన భారీ కటౌట్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఆహా కార్యాలయంపై ఈ భారీ కటౌట్ పెట్టారు. ఆ వీడియోను సమంత తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘లేడీ సూపర్ స్టార్ సమంత బిగ్గెస్ట్ పోస్టర్ ఇది’ అంటూ ఆహా వీడియోలో పేర్కొంది. స్టార్లకు ‘పెద్ద ఇగో’ ఎందుకు ఉంటుందని దీన్ని చూసి ఆశ్చర్యపోతారంటూ తన పోస్టర్ గురించి సమంత కామెంట్ చేసింది. కాగా, ఈ నెల 13 నుంచి ఈ షో ప్రీమియర్‌లు ప్రారంభం అవుతాయి.
Go Back to Shorts
Samantha
Tollywood
aha

More Telugu News