180 డిగ్రీల కోణంలో కంగన లెగ్ స్ట్రెచ్‌.. ఫొటో వైరల్
Add ap7am to your home Screen

180 డిగ్రీల కోణంలో కంగన లెగ్ స్ట్రెచ్‌.. ఫొటో వైరల్

kangana pics go viral
  • గతంలో షూటింగ్ సమయంలో తీసిన ఫొటో
  • ‘తను వెడ్స్ మను రిటర్న్స్’లో తను పాత్రలో కంగన
  • ‘దత్తు’ ఒక గొప్ప పాత్ర అవుతుందని ఎవరు ఊహించారని ప్రశ్న
గతంలో ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ షూటింగ్ సమయంలో తీసిన ఓ ఫొటోను హీరోయిన్ కంగన రనౌత్ తాజాగా తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. తాను చేసిన ‘దత్తు’ పాత్రకు సంబంధించిన ఫొటో ఇదని తెలిపింది. 180 డిగ్రీల కోణంలో కంగన లెగ్ స్ట్రెచ్‌ చేయడం పట్ల అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ సినిమాలో తాను నటించిన ‘దత్తు’ ఒక గొప్ప పాత్ర అవుతుందని ఎవరు ఊహించారు? అంటూ ఆమె ప్రశ్నించింది.

ఢిల్లీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ ఫొటో దిగానని చెప్పింది. ఆ సినిమాలో లాంగ్ జంప్ సీన్‌కు ముందు తాను పూర్తిగా కాళ్లను స్ట్రెచ్ చేశానని చెప్పింది. ఆ ఫొటోలో దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కూడా ఉన్నారని తెలిపింది. కాగా, లాక్‌డౌన్ తర్వాత కంగన మళ్లీ సినిమా షూటింగుల్లో పాల్గొంటోంది. ఆమె చేతిలో తలైవితో పాటు పలు సినిమాలు ఉన్నాయి.
Kangana Ranaut
Bollywood
Viral Pics

More Telugu News