ధరణి పోర్టల్ ప్రారంభం ఈ నెల 29కి వాయిదా
- ధరణి ప్రారంభోత్సవ షెడ్యూల్ లో మార్పు
- వర్షాలు, వరదలతో పోర్టల్ ఆస్తుల నమోదు ఆలస్యం
- తాజాగా ప్రకటన చేసిన సీఎంఓ
దీనిపై సీఎంఓ తాజా ప్రకటన చేసింది. ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ను ప్రారంభిస్తారని సీఎంఓ వెల్లడించింది. సీఎం కేసీఆర్ గతంలో అనేక కీలక నిర్ణయాలు దసరా సందర్భంగానే అమలు చేశారు. అయితే, ధరణి పోర్టల్ ప్రారంభోత్సవం మాత్రం వరుణుడి కారణంగా ఆలస్యం కానుంది.