Active Cases: ఏపీ కరోనా బులెటిన్: 25 మరణాలు, 3,967 కొత్త కేసులు

Active cases number declines in AP
  • ఏపీలో తగ్గుతున్న కరోనా తీవ్రత
  • గత 24 గంటల్లో 5,010 మందికి కరోనా నయం
  • యాక్టివ్ కేసుల సంఖ్య 38,979 మాత్రమే!
రాష్ట్రంలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొనే దిశగా గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. గత కొన్నినెలల కిందట పరిస్థితులతో పోల్చితే నేడు ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమంత తీవ్రంగా లేదని చెప్పొచ్చు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 3,967 పాజిటివ్ కేసులు రాగా, 25 మంది మరణించారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 627 కొత్త కేసులు రాగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 86 మందికి నిర్ధారణ అయింది. తాజాగా 5,010 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఇక, రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,75,470కి చేరగా, 7,30,109 మందికి కరోనా నయం అయింది. ఇంకా 38,979 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 6,382కి పెరిగింది.

More Telugu News

Active Cases
Andhra Pradesh
Corona Virus
Positive Cases
Deaths