అనారోగ్యంతో బాధపడుతున్న నటుడికి ఆసరాగా నిలిచిన సల్మాన్ ఖాన్
- బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫరాజ్ ఖాన్
- ఆసుపత్రి బిల్లులు చెల్లించిన సల్మాన్ ఖాన్
- సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన కశ్మీరా షా
సల్మాన్ ఖాన్... ఫరాజ్ కు మరింత సాయపడేందుకు సిద్ధంగా ఉన్నారని నటి కశ్మీరా షా సోషల్ మీడియాలో తెలిపారు. ఫరాజ్ ఆసుపత్రి బిల్లులు చెల్లిస్తోంది సల్మానే అంటూ కశ్మీరా షా పోస్టు చేయడంతో భాయ్ ఉదారత వెల్లడైంది. ఫరాజ్ ఖాన్ 1998లో మెహిందీ అనే చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ చిత్రంలో రాణి ముఖర్జీ కూడా నటించింది.