Revanth Reddy: అపెక్స్‌ కౌన్సిల్ భేటీ నేపథ్యంలో.. తన డిమాండ్ గుర్తు చేసిన రేవంత్ రెడ్డి!

demands TelanganaCMO  to include the NarayanpetKodangal Lift Irrigation scheme in the agenda
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఈ నెల 6న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదాపడ్డ ఈ సమావేశాన్ని ఈ నెల 6న నిర్వహిస్తామని ఇప్పటికే కేంద్ర జల్‌ శక్తి మత్రిత్వశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా దీనిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి తన డిమాండ్‌ను మరోసారి గుర్తు చేశారు. ఈ సమావేశంలో భాగంగా నారాయణ పేట్-కొడంగల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్ పథకాన్ని కూడా అపెక్స్‌ కౌన్సిల్‌ ఎజెండాలో కలపాలని ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని డిమాండ్ చేశారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, తెలంగాణ సీఎంవో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, భారత ప్రధాని కార్యాలయానికి ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
apex
KCR
Andhra Pradesh
Telangana

More Telugu News