వైట్ హౌస్ కు విషం పూసిన లెటర్ పంపింది ఓ మహిళ... అరెస్ట్ చేసిన పోలీసులు!
- శ్వేతసౌధం చిరునామాతో లెటర్
- కెనడా సరిహద్దుల్లో ఓ మహిళ అరెస్ట్
- మరింత లోతుగా విచారిస్తున్నామన్న అధికారులు
ఈ కేసులో పోలీసుల అదుపులో ఉన్న మహిళ వివరాలను వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. బుఫాలో సమీపంలోని పీస్ బ్రిడ్జ్ వద్ద యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఈ లేఖపై ఉన్న రసాయనం డెడ్లీ పాయిజన్ రిసిన్ గా నిర్ధారణ అయిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ లెటర్ కెనడా నుంచే వచ్చిందని, ముందుగానే గుర్తించామని, ఈ విషయంలో మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నామని, మొత్తం ఘటనపై బహిరంగ ప్రకటనలు చేసేందుకు ఎవరికీ అనుమతి లేదని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని సదరు అధికారి తెలిపారు.