సుషాంత్ పార్టీల్లో కొకైన్, ఎల్ఎస్డీ: ఎన్సీబీ విచారణలో రియా చెప్పినట్టు రిపోర్ట్!
- మాదక ద్రవ్యాలు తప్పనిసరిగా ఉండేవి
- ఇద్దరు బాలీవుడ్ నటులు కూడా ఉండేవారు
- 20 పేజీల రిపోర్టును తయారు చేసిన ఎన్సీబీ
ఈ కేసులో రియా, ఆమె సోదరుడు షోవిక్ లతో పాటు మిరాండాలకు మత్తు మందులను సరఫరా చేసిన రంజీత్ అనే వ్యక్తిని సహా ముంబైలో ఇంతవరకూ ఏడుగురిని ఎన్సీబీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తమ విచారణలో భాగంగా రియాను విచారించిన అధికారులు, దాదాపు 20 పేజీల రిపోర్టును తయారు చేసింది. తనతో డేటింగ్ లో ఉన్న సమయంలో సుశాంత్ ఎన్నో విషయాలను పంచుకున్నాడని చెప్పిన రియా, అతను ఇచ్చే పార్టీలకు హాజరయ్యే వారి పేర్లను కూడా పేర్కొంది. ఈ పార్టీలన్నీ సుశాంత్ ఫామ్ హౌజ్ లో జరుగుతాయని కూడా ఆమె చెప్పినట్టు తెలుస్తోంది.