'ఆర్ఆర్ఆర్'లో తన పాత్రపై శ్రియ స్పందన
- ఈ సినిమాలో నాది ఒక చిన్న పాత్ర
- అజయ్ దేవగణ్ పక్కన నటిస్తున్నా
- తారక్, చరణ్ లతో నాకు ఒక్క సీన్ కూడా లేకపోవడం బాధాకరం
'ఛత్రపతి' తర్వాత రాజమౌళితో మళ్లీ పని చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని శ్రియ తెలిపింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ తో కలిసి పని చేస్తున్నానని... ఆయన ఒక గొప్ప నటుడని కితాబిచ్చింది. అజయ్ ఎంతో మర్యాదపూర్వకమైన మనిషి అని చెప్పింది. అయితే, తారక్, చరణ్ లతో కలిసి తనకు ఒక్క సన్నివేశం కూడా లేకపోవడం బాధగా ఉందని తెలిపింది. వారి పాత్రలు మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతున్నాయని చెప్పింది.