రియా కేసులో కొత్త విషయం.. సుశాంత్ ఇంటి నుంచి రియా నివాసానికి కొరియర్!
- రియా బెయిల్ ను తిరస్కరించిన కోర్టు
- రియా ఇంటికి కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా
- కొరియర్ ను తీసుకున్న రియా సోదరుడు
తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. లాక్ డౌన్ సమయంలో సుశాంత్ ఇంటి నుంచి రియా నివాసానికి ఒక కొరియర్ వెళ్లిందనేది ఆ సమాచారం. రియా సోదరుడు ఆ కొరియర్ ను రిసీవ్ చేసుకున్నాడు. ఆ కొరియర్ లో డ్రగ్స్ ఉన్నాయని తెలుస్తోంది. డ్రగ్స్ అనే డౌట్ రాకుండా అరకిలో బరువున్న ఇతర వస్తువులను అందులో ప్యాక్ చేశారు. పోలీసుల సోదాల్లో చిక్కకుండా ఉండేందుకు డ్రగ్స్ ను కొరియర్ ద్వారా పంపించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో రియాకు కష్టాలు మరింత పెరిగాయనే చెప్పుకోవాలి.