సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Samantha faces camera after lock down
  • కెమేరా ముందుకు వచ్చిన సమంత
  • 'ఆచార్య' కోసం ముందుగా చరణ్ షూటింగ్
  • అమ్ముడుపోయిన 'వి' శాటిలైట్ హక్కులు   
*  లాక్ డౌన్ కారణంగా గత ఐదు నెలలుగా అందరితో పాటు షూటింగులకు దూరంగా వున్న కథానాయిక సమంత తాజాగా కెమెరా ముందుకు వచ్చింది. తను ఇటీవల ప్రారంభించిన 'సాకి' విమెన్స్ ఫేషన్ వేర్ సంస్థ ప్రచార చిత్రాల షూటింగులో తను పాల్గొంది. త్వరలోనే ఈ వాణిజ్య చిత్రాలు టీవీలలో ప్రసారం అవుతాయి.
*  కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' చిత్రం షూటింగును ఈ నెలలోనే ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, చిరంజీవి అప్పుడే షూటింగులో పాల్గొనరనీ, రామ్ చరణ్ పాల్గొనే సన్నివేశాలను మాత్రం ముందుగా చిత్రీకరిస్తారనీ తెలుస్తోంది.
*  నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన 'వి' చిత్రం ఈ నెల 5న డైరెక్టుగా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రం శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ 8 కోట్లు ఆఫర్ చేసి సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Samanta
Chiranjeevi
Ramcharan
Nani

More Telugu News