పార్టీ బలోపేతమే లక్ష్యంగా... కేసీఆర్ మరో కీలక సమావేశం ఏర్పాటు

KCR to organise meeting at Telangana Bhavan
  • ఈ నెల 27న తెలంగాణ భవన్‌లో అత్యున్నత స్థాయి సమావేశం
  • పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా భేటీ
  • భవిష్యత్ పోరాటాలకు శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న గులాబీ బాస్

బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల సందర్భంగా, పార్టీ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా ఈ భేటీ జరగనుంది.


పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ కార్యక్రమంపై కేసీఆర్ ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని రీ-ఆర్గనైజ్ చేసే దిశగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, జెడ్పీ మాజీ చైర్మన్లను ఆహ్వానించారు.


రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, భవిష్యత్ పోరాటాల కోసం శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా రజతోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఒక భారీ యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
Advertisement
KCR
BRS
High Level Meeting

More Telugu News