దీపిక ప్లానింగ్.. జస్ట్ మూడు రోజులలో పది వాణిజ్య చిత్రాలు!

Deepika shoots for commercial adds
  • లాక్ డౌన్ వల్ల పెండింగులో షూటింగులు
  • దీపిక చేతిలో పలు సినిమాలు, బ్రాండింగులు
  • యాడ్స్ పూర్తిచేసి, షూటింగుకి గోవాకి పయనం        
గత ఐదు నెలల నుంచీ కరోనా కారణంగా షూటింగులు బంద్ కావడంతో ఆయా సినిమాలకు ఆర్టిస్టులు కేటాయించిన డేట్స్ అన్నీ మురిగిపోయాయి. దీంతో ఇప్పుడు ఆయా సినిమాలకు డేట్స్ సర్దుబాటు చేయడం అన్నది తారలకు పెద్ద తలనొప్పే అని చెప్పాలి. ముఖ్యంగా భారీ సినిమాలు చేస్తూ, బ్రాండ్ అంబాసడర్లు గానూ వ్యవహరించే టాప్ స్టార్లకు ఇది మరింత ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణే పరిస్థితి కూడా అలాగే వుంది.

ఆమె పలు సినిమాలతో పాటు పలు ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. ఈ లాక్ డౌన్ కారణంగా పలు ఉత్పత్తుల ప్రచారం కోసం చేయాల్సిన షూటింగులు కూడా పెండింగ్ పడిపోయాయట. దాంతో ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుసగా ఈ షూటింగులకు హాజరుకావడానికి సమాయత్తమవుతోంది.

ఈ క్రమంలో తన మేనేజ్ మెంట్ బృందంతో కలసి చర్చించి మూడు రోజుల్లో మొత్తం పది యాడ్ ఫిలింల షూటింగులను పూర్తిచేసేయాలని నిర్ణయించుకుందట. ముంబైలోని స్టూడియోలో వీటిని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రీకరణ పూర్తయిన వెంటనే అమ్మడు గోవాకి వెళ్లి శకున్ బాత్రా దర్శకత్వంలో రూపొందే చిత్రం షూటింగులో జాయిన్ అవుతుంది.          
Go Back to Shorts
Deepika Padukone
Lockdown
Commercial Adds

More Telugu News