భర్త హత్యకు దారితీసిన వివాదాలు.. కత్తితో పొడిచి దారుణంగా హతమార్చిన భార్య
- గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు
- చేయి చేసుకోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భార్య
- నిందితురాలిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు
గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం మరోమారు వారిద్దరూ గొడవ పడి ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సబీనా భర్తను కత్తితో పలుమార్లు పొడిచింది. ఇది చూసిన పిల్లలు అరుస్తూ పక్కింటికి పరుగులు తీశారు. ఆరా తీసిన ఇరుగుపొరుగు విషయం తెలుసుకున్నారు. ఇంటికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న విశాల్‌ను ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోనే అతడు ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సబీనాను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.