Crime News: క‌రోనా సోకిన అమ్మాయిపై అంబులెన్సు డ్రైవ‌ర్ లైంగిక దాడి

driver rapes girl
షార్ట్స్‌లో చూడండి
కరోనా బారినపడిన యువతి(19)ని ఐసోలేష‌న్ కేంద్రానికి తీసుకెళ్తూ మార్గ‌మ‌ధ్యంలో అంబులెన్సును ఆపి‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ డ్రైవ‌ర్. కేరళలోని పఠనమిట్ట జిల్లా పంథాల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కరోనా లక్షణాలు ఉండడంతో ఓ యువ‌తి క్వారంటైన్‌లో ఉంది. అక్క‌డ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కొవిడ్ పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. ఆమెతో పాటు మరొకరిని వేర్వేరు కరోనా ఐసోలేష‌న్ కేంద్రాల‌కు తీసుకెళ్లేందుకు 108 అంబులెన్సు వ‌చ్చింది.

దాని డ్రైవర్‌ నౌఫాల్‌ (25) వారిలో ఓ బాధితురాల‌ని ఓ ఆసుప‌త్రి వ‌ద్ద దించాడు. అంబులెన్సులోని మ‌రో యువ‌తిని మ‌రో ఐసోలేష‌న్ కేంద్రంలో దించాల్సి ఉంది. ఈ స‌మ‌యంలోనే మార్గమధ్యంలో అంబులెన్సును ఆపి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ త‌ర్వాత‌ అర్ధరాత్రి స‌మ‌యంలో ఆమెను ఐసోలేష‌న్ కేంద్రం వ‌ద్ద దించాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై క‌ఠిన చర్య‌లు తీసుకోవాల‌ని కేర‌ళ‌ ఆరోగ్యశాఖ మంత్రి కె.కె శైలజ పోలీసులు, అధికారుల‌ను ఆదేశించారు.

Go Back to Shorts
Crime News
Kerala
Corona Virus

More Telugu News