ప్ర‌భాస్ పుట్టిన‌రోజు కామ‌న్ డీపీ అదుర్స్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్ర‌భాస్ పుట్టిన‌రోజు కామ‌న్ డీపీ అదుర్స్‌!

PrabhasAdvBdayCDP  Rebel Star Prabhas
  • అక్టోబ‌ర్ 23న ప్ర‌భాస్ పుట్టిన‌రోజు
  • కామ‌న్ డీపీ విడుద‌ల
  • బాహుబ‌లి గెట‌ప్ లో ప్ర‌భాస్
  • చుట్టూ ఆయ‌న న‌టించిన సినిమాల పేర్లు
సినీ హీరోల‌ పుట్టిన రోజు వేడుక‌కు ముందే అభిమానులు సందడిని మొద‌లు పెట్టేస్తారు. సామాజిక మాధ్య‌మాల్లో ఆ సంద‌డి అంతా ఇంతా కాదు. అప్ప‌ట్లో కేక్‌ కటింగ్‌లు, ఫెక్సీలు, దండలు, అన్న‌దానం, ర‌క్తదానం, పూజలు వంటి కార్య‌క్ర‌మాల్లో అభిమానులు పాల్గొనేవారు.

ఇప్పుడు వాటికి తోడు సామాజిక మాధ్య‌మాల్లో హంగామా చేయ‌డం చూస్తున్నాం. హీరోల పుట్టిన‌రోజుల‌కి కామన్ డీపీల‌ను విడుద‌ల చేయ‌డం, హ్యాష్ ట్యాగ్ లు ట్రెడింగ్ లో ఉండేలా ల‌క్ష‌లాది ట్వీట్లు చేయడం ప్ర‌స్తుతం సాధార‌ణ‌మైపోయింది.

తాజాగా, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన‌రోజు కామ‌న్ డీపీని విడుద‌ల చేశారు. అక్టోబ‌ర్ 23న‌ ప్ర‌భాస్ పుట్టిన‌రోజు ఉంది. అందుకు చాలా స‌మ‌యం ఉంది. అప్పుడే కామ‌న్ డీపీ విడుద‌ల కావ‌డం గ‌మ‌నార్హం. బాహుబ‌లి గెట‌ప్ లో చిరున‌వ్వులు చిందిస్తూ ఇందులో ప్ర‌భాస్ క‌న‌ప‌డుతున్నాడు. చుట్టూ ఆయ‌న న‌టించిన సినిమాల పేర్ల‌ను రాసుకొచ్చారు.
Prabhas
CDP
Social Media

More Telugu News