థ్యాంక్యూ భగవాన్.. రియా సోదరుడి అరెస్టుపై సుశాంత్ సోదరి
- నిన్న షోవిక్ ను అరెస్టు చేసిన ఎన్సీబీ
- డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు
- ఎన్సీబీపై సుశాంత్ సోదరి ప్రశంసలు
సుశాంత్ సోదరి శ్వేత సింగ్ కీర్తి ట్విట్టర్ లో ఈ విషయంపై స్పందిస్తూ...
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమర్థంగా విచారణ జరుపుతోందని చెప్పారు. తామంతా సత్యం వైపు పయనించేలా మార్గదర్శనం చేస్తున్నందుకు దేవుడికి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆమె ట్వీట్ చేశారు.
తన సోదరుడి కేసులో న్యాయం జరగాలని పోరాడుతున్న వారికి ఇదొక ఉపశమనమని పేర్కొన్నారు. గ్రేట్ స్టార్ ఎన్సీబీ అంటూ ఆమె హ్యాష్ ట్యాగ్ జోడించారు. కాగా, సుశాంత్ నుంచి రూ. 15 కోట్ల డబ్బును రియా తన ఖాతాలో వేయించుకుందని సుశాంత్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సుశాంత్‌కు రియానే డ్రగ్స్ అలవాటు చేసిందని కూడా ఆరోపణలు వచ్చాయి.