ఎస్పీ బాలు ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేసిన ఎంజీఎం ఆసుపత్రి
- బాలు స్పృహలోనే ఉన్నారని వెల్లడి
- చికిత్సకు స్పందిస్తున్నారన్న ఆసుపత్రి వర్గాలు
- నెల రోజులుగా ఎంజీఎం ఆసుపత్రిలో బాలుకు కరోనా చికిత్స
తాజాగా ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు ఎస్పీ బాలు ఆరోగ్యంపై ప్రత్యేక బులెటిన్ విడుదల చేశాయి. ఆయనకు ఇంకా వెంటిలేటర్ పై ఎక్మో సాయంతో చికిత్స కొనసాగుతూనే ఉందని ఆ బులెటిన్ లో తెలిపారు. ప్రస్తుతం బాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆయన స్పృహలోనే ఉన్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు. తమ ఆసుపత్రికి చెందిన భిన్న వైద్య విభాగాల నిపుణులు బాలు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని ఆ బులెటిన్ లో పేర్కొన్నారు.
.