Vijayasai Reddy: తెలుగు మాట్లాడడమే సరిగా రాదు... అప్పుడే వ్యాసాలు రాస్తున్నావా చిట్టీ: విజయసాయిరెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో మరోసారి ప్రతిపక్ష నేతపై సెటైర్లు వేశారు. సరిగా తెలుగు మాట్లాడడమే రాదు, అప్పుడే వ్యాసాలు రాస్తున్నావా చిట్టీ అంటూ వ్యంగ్యంగా అన్నారు. "దళితునిగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్న మీ నాన్నారుని అడుగు... ఎవరి దళిత పక్షపాతో, ఎవరు దళిత ద్రోహో చెబుతాడు. దళిత రిజర్వుడు స్థానాల్లో గత రెండు ఎన్నికల్లో టీడీపీ ఎన్ని సీట్లు గెలిచిందో లెక్కలు చూసుకో లోకేశం" అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Vijayasai Reddy
Tweets
Social Media
YSRCP
Andhra Pradesh

More Telugu News