Rakul Preet Singh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Rakul joins shoot of krish movie
షార్ట్స్‌లో చూడండి
*  కరోనా భయంతో షూటింగులు చేయడానికి హీరోహీరోయిన్లు చాలామంది వెనుకంజ వేస్తుంటే, రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం షూటింగులో నిన్న జాయిన్ అయింది. వికారాబాద్ అడవుల్లో నలభై రోజుల పాటు సింగిల్ షెడ్యూల్ లో ఈ చిత్రనిర్మాణాన్ని పూర్తిచేస్తారు.
*  విశాల్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'చక్ర' చిత్రాన్ని డైరెక్టుగా ఓటీటీ ద్వారా రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం 'జీ5' ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. ఇందులో 'జెర్సీ' ఫేం శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది.  
*  కథానాయిక కలర్స్ స్వాతి మళ్లీ వస్తోంది. గతంలో కొన్ని సినిమాలలో కథానాయికగా నటించిన ఈ చిన్నది పెళ్లయిన తర్వాత నటనకు దూరమైంది. ఇప్పుడు మళ్లీ ఓ వెబ్ సీరీస్ లో నటించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Rakul Preet Singh
Krish
Vishal
Colors Swathi

More Telugu News