నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు సుశాంత్ ను ప్రేమించడమే: రియా సంచలన వ్యాఖ్యలు!
- సుశాంత్ ఆత్మహత్య తరువాత ఇక్కట్లు
- నా వద్ద దాచేందుకు ఏమీ లేదు
- సుశాంత్ తో ప్రేమే కష్టాల పాలు చేసిందన్న రియా
తనను ఏ విచారణ సంస్థ ఇంటరాగేషన్ చేసినా, దాచి పెట్టేందుకు తన వద్ద ఏమీ లేదని వ్యాఖ్యానించిన రియా, తానెప్పుడూ డ్రగ్స్ వాడలేదని వ్యాఖ్యానించింది. కాగా, రియాపై సీబీఐతో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా దృష్టిని సారించిన సంగతి తెలిసిందే. ఆమె అక్రమంగా డబ్బు తరలించిందని ఈడీ, డ్రగ్స్ వాడకం, సరఫరా ఆరోపణలపై ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) కేసులను రిజిస్టర్ చేశాయి.