పేద మహిళకు ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు.. సాయం చేస్తున్న సోను సూద్
- కర్ణాటకలో యాదగిరి జిల్లాలో ఘటన
- శిశువులను పోషించే స్థితిలోలేని తల్లిదండ్రులు
- మీడియా ద్వారా తెలుసుకున్న సోను సూద్
కర్ణాటకలో యాదగిరి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పద్మ అనే ఓ పేద మహిళ ఒకే కాన్పులో ముగ్గురు మగబిడ్డలకు జన్మనిచ్చింది. అయితే, రెక్కాడితే కానీ డొక్కాడని పద్మ-నాగరాజ్ దంపతులకు ఆ బిడ్డలను పెంచడం తలకు మించిన భారమైంది. వారు ఓ చిన్న ఇంట్లో ఉంటున్నారు.
ముగ్గురు పిల్లలను ఎలా పెంచాలన్న ఆందోళనలో వారు ఉన్నారు. వారి బాధల గురించి మీడియాలో వచ్చిన వార్తలు సోను సూద్ దృష్టికి వెళ్లడంతో ఆయన దీనిపై స్పందించారు. తాను ఆ ముగ్గురు శిశువుల పోషణ కోసం సాయం చేస్తానని ప్రకటించారు. అంతేకాదు, వారి ఇంటికి మరమ్మతులు కూడా చేయిస్తానని చెప్పారు.