Roja: సినిమాలకు దూరంగా ఉన్నాను!: వైసీపీ ఎమ్మెల్యే రోజా

not acting in movies roja
షార్ట్స్‌లో చూడండి
చాలా రోజులుగా వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా కొత్త సినిమాల్లో కనిపించట్లేదు. రాజకీయాల్లో ఆమె బిజీ అయిపోయారు. అయితే, జబర్దస్త్ వంటి టీవీ కార్యక్రమాల్లో మాత్రం చురుకుగా పాల్గొంటూ ప్రేక్షకులకు దగ్గరవుతూనే ఉన్నారు. తాజాగా ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొని సినిమాల్లో నటించే అంశంపై స్పందించారు.

అప్పట్లో ఆమె చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా రోజా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె హీరో లేదా హీరోయిన్ తల్లి పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, ప్రస్తుతం తాను సినిమాలకు దూరంగా ఉన్నానని, చిరంజీవి, నాగార్జున సినిమాల్లో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని ఆమె చెప్పారు.
Go Back to Shorts
Roja
Tollywood
YSRCP

More Telugu News