బిగ్ న్యూస్ అనగానే... మీరు అలా ఫిక్స్ అయిపోతారా?: సందీప్ కిషన్
- హీరోగా బిజీగా ఉంటూనే నిర్మాతగా వ్యవహరిస్తున్న సందీప్
- అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటానన్న యువ హీరో
- ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని క్లారిటీ
అయితే, ఈ సినిమా ప్రకటనకు ముందు... బిగ్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నా, అందరూ సిద్ధంగా ఉండండి అని సందీప్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. అయితే, ఇప్పుడు టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది కదా. అందుకే అందరూ మనోడు పెళ్లి గురించి అనౌన్స్ చేస్తాడని భావించారు. దీనిపై తాజాగా సందీప్ క్లారిటీ ఇచ్చాడు. బిగ్ న్యూస్ అనగానే అందరూ పెళ్లి అని ఫిక్స్ అయిపోతారా? అని సరదాగా ప్రశ్నించాడు. మీ అందరికీ చెప్పే కదా నేను పెళ్లి చేసుకుంటా అని అన్నాడు. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? అని ప్రశ్నించాడు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని తెలిపాడు.