Cricket: నాకు కరోనా సోకలేదు: స్పష్టతనిచ్చిన మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా
- లారాకు కరోనా సోకిందని ప్రచారం
- కరోనా పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చిందన్న లారా
- తన గురించి అసత్య ప్రచారం జరుగుతోందని వ్యాఖ్య
- ఇటువంటి వార్తలు సరికాదని ఆగ్రహం
కరోనా వ్యాప్తి సమయంలో సామాజిక మాధ్యమాల్లో ఎన్నో అసత్య వార్తలు ప్రచారం అవుతున్నాయి. ప్రముఖులకు కరోనా వచ్చిందంటూ కొందరు ప్రచారం చేస్తుండడంతో అటువంటి వార్తలను నమ్ముతున్న సెలబ్రిటీల అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారాకు కరోనా సోకిందని ప్రచారం జరుగుతోంది.
దీంతో ఈ వార్తలపై లారా స్పందిస్తూ స్పష్టతనిచ్చారు. తనపై వస్తున్న ఆ ప్రచారమంతా అసత్యమేనని ఆయన చెప్పారు. కరోనా పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చిందని వివరించారు. సామాజిక మాధ్యమాల్లో తన గురించి అసత్య ప్రచారం జరుగుతోందని తెలిపారు.
ఇటువంటి ప్రతికూల ప్రచారాలను వ్యాప్తిచేయడానికి కొవిడ్-19 సంక్షోభాన్ని వాడొద్దని ఆయన సూచించారు. తనకు కరోనా పాజిటివ్ అని తేలిందంటూ ప్రచారమవుతున్న అసత్య వార్తలను తాను చదివానని ఆయన వివరించారు. ప్రజలకు నిజాలను తెలపాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
కొవిడ్-19 కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోన్న సమాజంలో ఇటువంటి అసత్య వార్తలను ప్రచారం చేసి ప్రజల్లో భయాందోళనలను వ్యాప్తి చేయడం సరికాదని తెలిపారు. ఇలాంటి అసత్య వార్తలతో తనను ప్రభావితం చేయలేరని ఆయన చెప్పారు. అయితే, తన శ్రేయోభిలాషులను మాత్రం ఈ అసత్య వార్తలు ఆందోళనకు గురిచేశాయని అన్నారు.