ఎంతో ప్రేమతో పెంచుకున్న నా కుక్క... విశ్వాసం చూపలేదంటూ నటుడు నాగబాబు పోస్ట్ చేసిన వీడియో!
- నవ్వులు పూయిస్తున్న నాగబాబు వీడియో
- భార్యకు పాములపై భయాన్ని పోగొట్టాలని బొమ్మ పాము
- దాన్ని చూసి హడలి పారిపోయిన శునకం
తాను 2006 నుంచి ఓ కుక్కను పెంచుకుంటూ, దానికి పీకూ అని పేరు పెట్టుకున్నానని, ఇది ఎవరైనా తనపైకి వస్తే, వారి మీద భీకరంగా దాడి చేస్తానన్నట్టుగా ఇంతకాలమూ కలరిచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలో, ఇటీవల జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియోను ఆయన పంచుకున్నారు. తన భార్య పద్మకు పాములంటే భయమని, ఆ భయాన్ని తొలగించేందుకు ఓ రబ్బర్ పామును తెచ్చి చూపిస్తున్న వేళ జరిగిన ఘటన ఇదని, దీని తీరువాత శునకాలు విశ్వాసాన్ని చూపిస్తాయన్న తన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని నాగబాబు వ్యాఖ్యానించారు. ఆయన అలా ఎందుకన్నారో ఈ వీడియో చూస్తే మీకే తెలిసిపోతుంది.