Sonu Sood: సాఫ్ట్ వేర్ శారద ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్న సోనూ సూద్

Sonu Sood responds to software Sarada plight
షార్ట్స్‌లో చూడండి
సోనూ సూద్... సాయానికి పర్యాయపదంగా మారిన పేరిది! లాక్ డౌన్ సమయంలో వలసకార్మికులను ఆదుకోవడం నుంచి, ఇవాళ ఓ రైతుకు కొత్త ట్రాక్టర్ బహూకరించడం వరకు సోనూ సూద్ దాతృత్వానికి ఎల్లలు లేవని నిరూపితమైంది.

తాజాగా, వరంగల్ కు చెందిన సాఫ్ట్ వేర్ శారదపై మీడియాలో కథనానికి ఆయన స్పందించారు. లాక్ డౌన్ కారణంగా సాఫ్ట్ వేర్ జాబ్ కోల్పోయిన శారద స్వస్థలం చేరుకుని కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తున్న వైనం సోనూ సూద్ ను కదిలించింది.  ఈ నేపథ్యంలో మీడియా ద్వారా సాఫ్ట్ వేర్ శారద ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నారు. ఆమెతో మాట్లాడతానని, ఆమెకు తప్పకుండా సాయం చేస్తానని సోనూ వెల్లడించారు. శారద ఆత్మస్థైర్యాన్ని ప్రశంసించారు.
Go Back to Shorts
Sonu Sood
Sarada
Software
Warangal
Telangana

More Telugu News