కరోనా వైరస్‌ను సమర్థంగా అడ్డుకునే మరో 21 రకాల ఔషధాల గుర్తింపు
- అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ బర్న్‌హామ్ ప్రిబైస్ మెడికల్ డిస్కవరీ ఇనిస్టిట్యూట్ అధ్యయనం
- 12 వేల ఔషధాలపై పరిశోధన
- రెమ్‌డెసివిర్‌తో కలిపి వాడేందుకు 21 ఔషధాల గుర్తింపు
అంతేకాదు, వీటిలో నాలుగు ఔషధాలను ప్రస్తుతం కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్న రెమ్‌డెసివిర్‌లో కలిపి వాడొచ్చని కూడా శాస్త్రవేత్తలు తెలిపారు. రెమ్‌డెసివిర్ ఔషధం అందరిపైనా పనిచేయదని, బాధితుడు కోలుకునే సమయాన్ని మాత్రం ఇది తగ్గించిందని అధ్యయనంలో పాల్గొన్న భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త సుమిత్ చంద్ర పేర్కొన్నారు. కాబట్టి రెమ్‌డెసివిర్‌తో కలిసి ఉపయోగించగలిగే ఔషధాల కోసం అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా 21 ఔషధాలను గుర్తించినట్టు వివరించారు.