బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. కరోనా కాలంలో కూడా వేతన పెంపు, ప్రోత్సాహకాలు!
- 15 శాతం వరకూ వేతనాల పెంపు
- పెన్షన్ కంట్రిబ్యూషన్ 4 శాతం పెంపు
- లాభాల్లో ఉన్న బ్యాంకు ఉద్యోగులకు ఇన్సెంటివ్ లు
- ఐబీఏతో ఉద్యోగ సంఘాల చర్చల్లో నిర్ణయం
ఈ పెంపు నవంబర్ 2017 నుంచే అమలులోకి రానుంది. దీని ప్రకారం, గతంలో బేసిక్ వేతనంలో 10 శాతం పదవీ విరమణ ప్రయోజనాల్లో కలుస్తుండగా, ఇకపై 14 శాతం బేసిక్ వేతనం, డీఏలు పెన్షన్ మొత్తానికి జమ కానున్నాయి. ఈ నిర్ణయంతో ఉద్యోగుల వేతనాల బిల్లు సంవత్సరానికి రూ. 7,900 కోట్ల మేరకు పెరుగుతుంది. ఇక, 5 శాతానికి మించిన నిర్వహణా లాభాలను సాధించిన బ్యాంకుల ఉద్యోగులకు అదనంగా ఇన్సెంటివ్ లు కూడా అందనున్నాయి.