nitin: షాలినికి ఉంగరం తొడిగిన హీరో నితిన్.. సిగ్గుపడుతూ మెరిసిపోయిన పెళ్లి కూతురు.. ఫొటో ఇదిగో

Aaaand ENGAGED says nitin
షార్ట్స్‌లో చూడండి
'నిశ్చితార్థం జరిగింది' అంటూ టాలీవుడ్ హీరో నితిన్ తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ రోజు ఓ పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా తన కాబోయే భార్య షాలినికి ఉంగరం తొడుగుతున్న ఫొటోను పోస్ట్ చేశాడు. నిశ్చితార్థంలో సిగ్గుపడుతూ, చిరునవ్వులు చిందిస్తూ షాలిని కనపడింది. నితిన్ ఇంట పెళ్లి వేడుక సందడి నెలకొంది. ఈ వేడుకలు ఐదు రోజుల పాటు జ‌ర‌గ‌నున్నాయి. ఈ రోజు హైద‌రాబాద్‌లో నితిన్, షాలినిల కుటుంబ పెద్ద‌లు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు.

కరోనా నేపథ్యంలో పెళ్లి వేడుకలను నిరాడంబరంగానే నిర్వహిస్తున్నారు. ఈ నెల 26న రాత్రి  8.30 గంట‌లకు నితిన్, షాలిని వివాహానికి ముహూర్తం నిశ్చయమైంది. ఇప్పటికే పరిమిత సంఖ్యలో రాజకీయ, సినీ ప్రముఖులను నితిన్‌ తన పెళ్లికి ఆహ్వానించారు. 
Go Back to Shorts
nitin
Tollywood
marriage

More Telugu News