హత్య కేసులో దర్యాప్తు.. పులివెందులలోని వివేకా ఇంటిని పరిశీలించిన సీబీఐ అధికారులు
- అక్కడి నుంచి పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి అధికారులు
- కేసుకు సంబంధించిన వివరాల సేకరణ
- గత ఏడాది వివేకానందరెడ్డి సొంతింట్లోనే దారుణ హత్య
ఈ కేసుకు సంబంధించి వివరాలు తెలుసుకుంటున్నారు. గత ఏడాది మార్చి 15న వివేకానందరెడ్డి సొంతింట్లోనే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం 3 సార్లు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరిపించగా, మొత్తం 1,300 మంది అనుమానితులను సిట్ అధికారులు విచారించారు.
అయినప్పటికీ ఈ కేసును ఛేదించలేకపోయారు. ఈ కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించడంతో, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు.