అలాంటి దుస్తులు నేను ధరించలేను: సాయి పల్లవి

I cant wear short dresses says Sai Pallavi
  • ఏదో సాధించేయాలన్న కోరికలు నాకు లేవు
  • నా కెరీర్ పట్ల సంతోషంగా ఉన్నాను
  • కురచ దుస్తులు సౌకర్యవంతంగా ఉండవు
సాయి పల్లవి అనగానే మనకు ఒక సహజనటి గుర్తొస్తుంది. చేసింది కొన్ని సినిమాలే అయినా... మంచి టాలెంటెడ్ నటిగా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి మంచి నటి మాత్రమే కాదు. మంచి డ్యాన్సర్ కూడా. అద్భుతమైన డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆమె అలరించింది. త్వరలోనే ఆమె కొరియోగ్రఫీ కూడా చేసే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం ఆమె నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల  తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సాయిపల్లవి పలు విషయాలను వెల్లడించింది.

తన కెరీర్ పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని సాయి పల్లవి తెలిపింది. పెద్దపెద్ద సినిమాల్లో నటించాలని, ఏదో సాధించేసేయాలనే కోరికలు తనకు లేవని చెప్పింది. తన వద్దకు ఏదైనా కథ వస్తే... అది తనకు సరిపోతుందా? లేదా? అనే విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తానని తెలిపింది. తనను ప్రేక్షకులు కూడా ఒక పెద్ద హీరోయిన్ గా చూడరని... ఇంట్లో అమ్మాయిగానే చూస్తారని చెప్పింది. కురచ దుస్తులు తాను ధరించలేనని... వాటిని ధరిస్తే తనకు, తనను చూసేవారికి సౌకర్యవంతంగా ఉండదని తెలిపింది. అలాంటి పాత్రల్లో ప్రేక్షకులు తనను చూడలేరని చెప్పింది.
Go Back to Shorts
Sai Pallavi
Tollywood

More Telugu News