ఎంఎస్ ధోనీ లుక్ చూసి ఆశ్చర్యపోతున్న అభిమానులు!
- వీడియోను షేర్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్
- మరింత యువకుడిగా కనిపిస్తున్న ధోనీ
- తమ స్టార్ క్రికెటర్ వచ్చేశాడంటున్న ఫ్యాన్స్
ఈ లుక్ లో ధోనీ తన వయసును కాస్తంత తగ్గించుకున్నట్టు కనిపించాడు. ఎవరితోనో వీడియో కాల్ లో హాయ్ చెబుతున్నట్టు కనిపిస్తున్నాడు. ఈ వీడియోను, ధోనీ రూపాన్ని చూసిన ఫ్యాన్స్, తమ స్టార్ ఆటగాడు తిరిగి గ్రౌండ్ లోకి దిగేందుకు సిద్ధమైపోయాడని కామెంట్లు పెడుతున్నారు. కాగా, గత సంవత్సరం జూలై తరువాత ధోనీ ఇంతవరకూ బ్యాట్ ను పట్టుకోలేదన్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం ఐపీఎల్ జరిగితే, ధోనీని క్రికెట్ మైదానంలో తిరిగి చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.