కరోనా చికిత్సపై ఫిర్యాదులు.. ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో గవర్నర్ తమిళిసై సమీక్ష
Add ap7am to your home Screen

కరోనా చికిత్సపై ఫిర్యాదులు.. ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో గవర్నర్ తమిళిసై సమీక్ష

Gov Tamilisai holds meeting with private hospitals representatives
  • నిన్న నెటిజన్లతో సమీక్ష నిర్వహించిన గవర్నర్
  • ఆసుపత్రుల్లో సరైన వైద్య సాయం అందడం లేదని గవర్నర్ కు ఫిర్యాదు
  • పలు అంశాలపై ఆసుపత్రుల ప్రతినిధులతో చర్చిస్తున్న తమిళిసై
తెలంగాణలో కరోనా  వైరస్ ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఒక్క రోజు వ్యవధిలోనే 1800కు పైగా కేసులు నమోదు కావడం... పరిస్థితి ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందటం లేదని బాధితులు గవర్నర్ కు తెలిపారు. నిన్న దాదాపు గంటన్నరసేపు నెటిజన్లతో గవర్నర్ సంభాషించారు. బాధితుల సాధకబాధకాలను తెలుసుకున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కరోనా పరీక్షలు, చికిత్స, పేషెంట్ల బెడ్లు, ట్రీట్మెంట్ బిల్లులు, ప్రజలు తెలిపిన ఫిర్యాదులు తదితర అంశాలపై వారితో చర్చిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగుతోంది. గవర్నర్ తో భేటీ  అయిన వారిలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, కిమ్స్, కేర్ ఆసుపత్రి, అపోలో, విరించి, కామినేని, సన్ షైన్, గ్లోబల్, మల్లారెడ్డి నారాయణ, యశోద, కాంటినెంటల్ ఆసుపత్రుల ప్రతినిధులు ఉన్నారు.
.
Tamilisai Soundararajan
Telangana
Corona Virus

More Telugu News