రాజీవ్ హత్యోదంతంపై సినిమా.. మురుగన్ పాత్రలో సంగీత దర్శకుడు!
- 'పలాస 1978' ద్వారా రఘు కుంచెకు మంచి పేరు
- కొక్కిరిగడ్డ మహేంద్ర దర్శకత్వంలో 'కథా నళిని'
- మురుగన్ పాత్ర పోషిస్తున్న రఘు
- మురుగన్, నళినిల ప్రేమకథ హైలైట్
1991లో జరిగిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్య సంఘటన కథాంశంతో ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. రాజీవ్ హత్య కేసులో మొదట్లో మరణశిక్ష పడి, అనంతరం అది యావజ్జీవ శిక్షగా మారడంతో జైలు జీవితాన్ని గడుపుతున్న ప్రధాన దోషులలో ఒకడైన మురుగన్ పాత్రను ఈ చిత్రంలో రఘు కుంచె పోషిస్తున్నారు.
ఇదే కేసులో గత ఇరవై తొమ్మిదేళ్లుగా జైలు జీవితం గడుపుతున్న మురుగన్ భార్య నళిని పాత్రలో ఓ ప్రముఖ నటి నటిస్తోంది. ఈ సినిమాలో హత్య కుత్రకోణంతో పాటు వీరి ప్రేమకథను ఎక్కువగా డీల్ చేస్తున్నారట. తెలుగులో ఈ చిత్రానికి 'కథా నళిని' అనే టైటిల్ని నిర్ణయించారు. నూతన దర్శకుడు కొక్కిరిగడ్డ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గోగో బ్యానర్ పై నిర్మిస్తున్నారు.