హైదరాబాదులో దారుణం... మంచినీటి ట్యాంకర్ పై నిల్చుని కాళ్లు కడుక్కున్న డ్రైవర్!
- వీడియో వైరల్
- డ్రైవర్ పై పోలీసులకు ఫిర్యాదు
- కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు
ఈ ఘటన మూసాపేటలో జరిగినట్టు సమాచారం. ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఇలాంటి చర్యలతో మరింత ఆందోళన కలిగిస్తున్నారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ట్యాంకర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.