సుశాంత్ మృతికి కారణమైన వారెవరూ అతని అంత్యక్రియలకు హాజరు కాలేదు: నికీషా పటేల్
- సుశాంత్ అంత్యక్రియలకు బాలీవుడ్ ప్రముఖులు ఎందుకు హాజరుకాలేదు?
- భోజనం చేస్తూ బిజీగా ఉన్నారా?
- బాలీవుడ్ లో మానవత్వం ఎక్కడుంది?
సుశాంత్ అంత్యక్రియలకు బాలీవుడ్ ప్రముఖులు హజరుకాకపోవడాన్ని నికీషా తప్పుపట్టింది. అంత్యక్రియలకు బాలీవుడ్ ప్రముఖులు ఎందుకు హాజరుకాలేదనేదే తన ప్రశ్న అని అంది. లంచ్ చేస్తూ బిజీగా ఉన్నారా? అని దుయ్యబట్టింది. బాలీవుడ్ లో మానవత్వం ఎక్కడుందని ప్రశ్నించింది. సుశాంత్ స్టార్ వారసుడు కాదని... ఇలాంటి వారిని బాలీవుడ్ లో ఎందుకు పట్టించుకుంటారని ప్రశ్నించింది. సుశాంత్ ఆత్మహత్యకు కారణమైన వారెవరూ అంత్యక్రియలకు హాజరుకాలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది.