పోలీసుల అనుమతి కోసం ఎదురుచూస్తున్న రాజమౌళి!
Add ap7am to your home Screen

పోలీసుల అనుమతి కోసం ఎదురుచూస్తున్న రాజమౌళి!

Police Twist to Rajamouli
  • షూటింగ్స్ చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వ ఆదేశం
  • ఏర్పాట్లు చేసుకున్న రాజమౌళి
  • ఇంకా అనుమతించని పోలీసులు
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో షూటింగ్ లను తిరిగి ప్రారంభించేందుకు అనుమతించిన నేపథ్యంలో, దర్శకదిగ్గజం రాజమౌళికి షాక్ తగిలింది. ఇటీవల సినీ పెద్దలతో సమావేశమైన ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్ చేసుకోవచ్చని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ డూప్ లతో టెస్ట్ షూటింగ్ చేయాలని రాజమౌళి భావించారు. ఇలా చేస్తూ, ప్రభుత్వ విధి విధానాలను పాటిస్తూ, ఆ సంకేతాలు ఇతర నిర్మాతలు, దర్శకులకు పంపించాలని ఆయన భావించారు.

దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు కూడా. అయితే, ఇందుకు కూడా పోలీసుల అనుమతి కావాల్సివుంది. అయితే, ముందుగానే దరఖాస్తు చేసుకున్నా రాజమౌళి టీమ్ కు పోలీసుల నుంచి అనుమతి రాలేదు. పోలీసుల నుంచి అనుమతి వచ్చిన తరువాత మాత్రమే టెస్ట్ షూట్ చేసుకునే వీలుండటంతో ప్రస్తుతానికి పనులు ఆగిపోయాయి. తాము అనుమతుల కోసం వేచి చూస్తున్నామని, మరో రెండు రోజుల్లో వస్తాయని భావిస్తున్నామని రాజమౌళి టీమ్ భావిస్తోంది.
Rajamouli
RRR
Shooting
Telangana

More Telugu News